This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ఇన్ విట్రో ఫర్టిలైజేషన్)

Conception
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
ఇన్ విట్రో ఫర్టిలైజేషన్)
Read time4 min

నేటి ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడితో, చాలా మంది హార్మోన్ల అసమతుల్యతలను కలిగివున్నారు, ఇది వంధ్యత్వానికి దారితీస్తుంది. అటువంటి సందర్భాలలో, వైద్యులు దంపతులకు IVF చికిత్స చేయించుకొనేందుకు సిఫార్సు చేయవచ్చు. IVF, దీనిని ఇన్-విట్రో ఫర్టిలైజేషన్ అని కూడా పిలుస్తారు, ఇది స్త్రీలకు గర్భదారణకి సహాయపడుతుంది. IVF ప్రక్రియలో శుక్రకణాలు మరియు అండం స్త్రీ శరీరం వెలుపల ఒక టెస్ట్ ట్యూబ్‌లో ఫలదీకరణం చెందించబడతాయి.

IVF అంటే ఏమిటి?

IVF అనేది స్త్రీలకు గర్భాన్ని కలిగించే ఒక కృత్రిమ ప్రక్రియ. ఇది ఒక పిండకణాన్ని ఉత్పత్తి చేయడానికి ఆండాన్ని మరియు శుక్రకణాలను కృత్రిమంగా ఫలదీకరణం చెందించే ప్రక్రియ. పిండకణం మార్పిడికి సిద్ధమైన తర్వాత, గర్భం కోరుకున్న స్త్రీ శరీరం లోపల ఉంచబడుతుంది. తర్వాత ఆ మహిళ సాధారణంగా IVF మందులను వాడవలసి ఉంటుంది, కాబట్టి ఆమె శరీరం గర్భాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంచాలి.

IVF చికిత్స ఎప్పుడు పొందాల్సి ఉంటుంది?

IVF క్రింది సందర్భాలలో సూచించబడుతుంది:

1. స్టెరిలైజేషన్‌కి ముందు

శాశ్వతంగా గర్భం రాకుండా ఉండేందుకు ట్యూబల్ లిగేషన్ అని పిలువబడే ప్రక్రియలో ఫెలోపియన్ ట్యూబ్‌లు కత్తిరించబడతాయి లేదా నిరోధించబడతాయి. మీ ట్యూబ్‌లను నిరోధించిన తర్వాత ఎవరైనా గర్భం దాల్చాలనుకొంటే ట్యూబల్ లిగేషన్ రివర్సల్ సర్జరీ కంటే IVF ఉత్తమ ఎంపిక అవుతుంది.

2. అంతర్లీన వైద్య సంబంధ సమస్యలున్నప్పుడు

ఫెలోపియన్ ట్యూబ్‌లో అడ్డుగా ఏదైనా ఉండటం లేదా ట్యూబుకి గాయం అయినప్పుడు, అండం ఫలదీకరణం చెందడం లేదా పిండం గర్భాశయానికి ప్రయాణిచడం సవాలుగా మారుతుంది. అటువంటి సందర్భంలో, IVF సిఫార్సు చేయబడుతుంది.

3. గర్భాశయ కణితులు ఉన్నప్పుడు

ఫైబ్రాయిడ్‌లు అనేవి గర్భాశయంలో ఉండే నిరపాయమైన కణితులు. 30 నుండి 40 ఏళ్లలోపు మహిళల్లో ఇవి అతి సాధారణం. ఫైబ్రాయిడ్లు ఫలదీకరణం జరిగిన ఆండాన్ని గర్భాశయంలో సరిగ్గా అమరకుండా నిరోధించవచ్చు.

4. అండాశయాలు పనిచేయకపోవడం

అండోత్సర్గము అప్పుడప్పుడు లేదా అసలు జరగనట్లయితే ఫలదీకరణం కొరకు తక్కువ అండాలు అందుబాటులో ఉంటాయి.

5. తక్కువస్థాయిలో ఉండే వంధ్యత్వానికి

అనేక కారణాల కోసం పరీక్షించినప్పటికీ కారణం తెలియకపోవడాన్ని వివరించలేని వంధ్యత్వం అంటారు.

6. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక మరియు సిస్టమెటిక్ వ్యాధులు

మీ సంతానోత్పత్తిపై ప్రభావం చూపించే క్యాన్సర్ చికిత్సను మీరు తీసుకోబోతున్నట్లయితే IVF ఒక మంచి ఎంపికగా ఉండవచ్చు. స్త్రీలు తమ అండాశయాలను ఆండాల కోసం సంరక్షించుకోవచ్చు, తర్వాత వాటిని ఫలదీకరణం చేయకుండా శీతలీకరించవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా, అందాలను ఫలదీకరణం చెందించి కూడా శీతలీకరించి నిల్వ చేయవచ్చు.

7. తగ్గిన శుక్రకణాల సంఖ్య లేదా శుక్రకణాల నాణ్యత

తక్కువ సంఖ్యలో ఉన్న శుఖ్రకణాల, పరిమిత కదలిక (పేలవమైన చలనశీలత) లేదా పరిమాణం ఇంకా రూపాలలో అసాధారణతలు కలిగి ఉంటే, అండాన్ని ఫలదీకరణం చెందించడంలో సమస్యలుండవచ్చు. వీర్యంలో అసాధారణతలు ఉన్నట్లు తెలిస్తే వంధ్యత్వ నిపుణుడితో సంప్రదింపులు జరపడం అవసరం.

8. ఎండోమెట్రియోసిస్ (గర్భాశయం లోపల కణాలు గర్భాశయ కుహరం వెలుపల పెరగడానికి కారణమయ్యే పరిస్థితి)

గర్భాశయ లైనింగ్ ఇంప్లాంట్‌లను పోలిన కణజాలం గర్భాశయం వెలుపల వ్యాపించినప్పుడు ఇది అభివృద్ధి చెందుతుంది, ఇది తరచుగా అండాశయాలు, గర్భాశయం మరియు ఫెలోపియన్ ట్యూబ్‌లను దెబ్బతీస్తుంది.

9. జన్యు సంబంధ పరిస్థితి

మీరు లేదా మీ జీవిత భాగస్వామి మీ బిడ్డకు జన్యుపరమైన సంక్రమణను కలిగించే ప్రమాదం ఉన్నట్లయితే మీరు IVFకి అర్హులు. అన్ని జన్యుపరమైన సమస్యలు గుర్తించబడనప్పటికీ, అండాలు సంగ్రహించిన మరియు ఫలదీకరణం చేసిన తర్వాత నిర్దిష్ట జన్యుపరమైన సమస్యల కోసం తనిఖీ చేయబడతాయి. ఎటువంటి సమస్యలు లేని పిండాలను గర్భాశయంలో ఉంచవచ్చు.

IVF చికిత్స అంటే ఏమిటి?

IVF అనేది బహుళ-దశల, కష్టతరమైన ప్రక్రియ. ఇందుకు సగటున నాలుగు నుండి ఆరు వారాలు పడుతుంది. ఇది అండాన్ని తిరిగి సంగ్రహించే ముందు నుండి ప్రెగ్నెన్సీ టెస్ట్ నిర్ధారించబడే వరకు సమయాన్ని కలిగి ఉంటుంది. సంతానోత్పత్తి సమస్యలు లేదా దంపతులకు ముందునుంచి ఉన్న వైద్య పరమైన సమస్యల వంటి వివిధ కారణాల వల్ల ప్రజలు IVFని ఎంచుకుంటారు. కొందరు వ్యక్తులు ముందు తీసుకున్న సంతానోత్పత్తి చికిత్సలు వారికి పని చేయకపోతే లేదా వారు సంతానోత్పత్తి వయస్సును దాటినట్లయితే IVF ను చేయించుకోవాలని అనుకుంటారు. IVF అనేది స్వలింగ జంటలకు కూడా ఆచరణీయమైన ప్రక్రియ.

భారతదేశంలో IVF చికిత్సకు అయ్యే ఖర్చు

భారతదేశంలో IVF ధర రూ. లక్ష నుండి 3 లక్షల మధ్య ఉంటుంది. ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజు, హార్మోన్లు, మందులు, కన్సల్టేషన్ ఛార్జీలు, ఈ ప్రక్రియ ఇంకా చికిత్సానంతర పరిచర్యలు ఉంటాయి.

ముగింపు

ఇన్-విట్రో ఫర్టిలైజేషన్ అంటే స్త్రీ శరీరం వెలుపల శుక్రకణాలు మరియు అండాల మధ్య జరిగే కృత్రిమ గర్భధారణ. సహజంగా పిల్లలు పుట్టని జంటలు, స్వలింగ జంటలు లేదా ఒంటరి తల్లిదండ్రులు ఈ విధానాన్ని అవలంబిస్తారు. శుక్రకణాలు లేదా అండం దంపతులవి లేదా దాతవి కావచ్చు. దాత విషయంలో అన్నీ విషయాలు పూర్తిగా అనామకంగా ఉండేలా చూస్తారు. మీరు IVF గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, ఈరోజే మీ వైద్యుడిని సందర్శించండి.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.